విత్తనాల కొనుగోలు పై రైతులకు అవగాహన ..

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్, దొమ్మరి చౌడు తాండా, ఇనాయత్ నగర్, చౌట్ పల్లి గ్రామలలో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు విత్తనాల కొనుగోలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  రైతులకు  విత్తనాలు కొనుగోలు చేసేటపుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు సవివరంగా తెలియజేశారు. వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్సు వున్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కోనలని, అలాగే తప్పని సరిగా రసీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు కొనుగోలు చేసిన విత్తనాలకు సంబంధించిన రసీదు, విత్తన సంచి జాగ్రత్తగా ఉంచాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఎస్. సాయిరాం  రాజు, జి రమేష్ , మొగిలి పద్మ, ఆయా గ్రామాల రైతులు, తదితరులు  పాల్గొన్నారు.