శిలీంద్రం వాడకంపై రైతులకు అవగాహన

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలం లోని ఉప్లూర్ గ్రామంలో పసుపు పంట వేసే రైతులకు నిజామాబాద్  జీవ నియంత్రణ ప్రయోగశాల ఏవో శృతి పసుపు పంటలో ట్రైకోడర్మ విరిడే శిలీంద్రం వాడకం, ఉపయోగల పైన రైతులకు అవగాహన కల్పించారు. ఈ శిలీంద్రము  పసుపులో వచ్చే  దుంపకుళ్ళు, సోయాబీన్, మొక్కజొన్నలో వచ్చే ఎండు తెగులును కలిగించే శిలీంద్రాన్ని  మొక్క వేరు చుట్టూ వృద్ధి చెడకుండా చేసి  తెగులు ను రానీయకుండా చేస్తుందని రైతులకు వివరించారు. ఈ సందర్భంగా విత్తన శుద్ధిపై రైతులకు అవగాహన కల్పించారు.

విత్తన శుద్ధి..

పొడి మందుగా ఒక కిలో పసుపు విత్తనానికి 10 కిలోలు, నీటిలో కలిపి వాడడం కోసం ఒక ఎకరానికి  విత్తనంకు 100 లీటర్ల నీటిలో అరగంట పాటు విత్తనాన్ని ముంచి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలన్నారు.
భూమిలో చల్లు విధానం..
100 కిలోల బాగా మాగిన సేంద్రియ ఎరువులో 5 కిలోల ట్రై కోడేర్మ విరిడే బాగా కలిపి  నీడలో 12  నుండి 15 రోజులు మాగనివ్వాలన్నారు. ప్రతి  5 రోజులకి ఒకసారి బెల్లం కలిపిన నీటిని మిశ్రమం పై చల్లి కలపాలని,12 రోజులకు శిలిండ్రం అభివృద్ధి చెందిన తరువాత మొక్క వెర్లకు అందుబాటులో ఉండేలా ఒక ఎకరా భూమిలో తేమ వునపుడు చల్లుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, గ్రామ రైతులు బద్దం చిన్నారెడ్డి, బద్దం రమేష్ రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, ఏనేడ్ల ప్రసాద్, కపిల్,  తదితరులు పాల్గొన్నారు.