మండల కేంద్రమైన తాడిచెర్లలోని కెడిసిసి బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక,అక్షరాస్యతపై బ్యాంకు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మేనేజర్ వెంకట్రాజం మాట్లాడారు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం డిసెంబర్ లో ప్రారంభమై భూపాలపల్లి, కాటారం,మల్హర్ మండలాల్లో బ్యాంకు అవగాహన సదస్సులు చేపట్టి ప్రజల్లో అవగాహనను పెంపొందించడం జరుగుతుందన్నారు.డిజిటల్ బ్యాంకింగ్ ఆన్లైన్ మోసాలు చిన్న చిన్న పొదుపుతో ఎలా కుటుంబాన్ని మెరుగుపరచుకోవచ్చనేదానిపై వివరించారు.పిఎంఎస్బివై, పీఎంజేజేబివై,ఏపివై,ఏస్ఎస్ వై అనే విషయాల పట్ల పూర్తి అవగాహన కలిగించారు ఆర్థిక అక్షరాస్యత కేంద్రంలో పనిచేస్తున్న జిల్లా కోఆర్డినేటర్ సురేష్ కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల్లో ఏ విధంగా సహాయం అందించాలని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తయ్య, ఎంపిటిసి రావుల కల్పన మొగిలి,పంచాయతీ కార్యదర్శి, ఎమ్మెస్ ప్రెసిడెంట్ మినా,విఓఎలు పాల్గొన్నారు.