ఆహార పదార్థాల నిలవపై అవగాహన

నవతెలంగాణ జమ్మికుంట
ఆహార పదార్థాల నిలువపై పట్టణంలోని కృషివిజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో జాతీయ మొక్కల రక్షణ సంస్థ వారి ఆద్వర్యంలో రైతులకు, మిల్లర్లకు,   పప్పుధాన్యాలు, నూనెగింజలు, పరిదాన్యం నిల్వచేసుకోవడానికి అవగాహన నిర్వహించారు. ( ఓరా) యాక్ట్ 2007 ప్రకారం నిల్వచేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్ర వేశపెట్టిన ఎన్ ఐ పి హెచ్ ఎం అధిపతి అయినా డాక్టర్ మరియదాస్  వివరించారు. డబ్ల్యూ ఐ డి ఆర్ ఏ గోదాముకు రైతులను తీసుకెళ్ళి గోదాములల్లో వారు తీసుకుంటున్న జాగ్రత్తల గురించి వివరించారు.  కార్యకమంలో కె వి కే గృహ విజ్ఞాన  శాస్త్రవేత్త ఏ ప్రశాంతి, శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి విజయ్ ,రైతులు తదితరులు పాల్గొన్నారు.