లింగ సమానత్వంపై అవగాహన

– రత్న దీప్‌లో ప్యానెల్‌ చర్చ
హైదరాబాద్‌ : మూడు దశాబ్దాలు పైగా రిటైల్‌ రంగంలో ఉన్న రత్నదీప్‌లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని 8, 9 తేదిల్లో ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించారు. ఈ సందర్బంగా లింగ సమానత్వం నిబద్దతపై అవగాహన కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. సికింద్రాబాద్‌ విక్రంపురిలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయంలో ప్రత్యేక ప్యానెల్‌ చర్చను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. స్త్రీలు సమానత్వానికి మూలమని రత్నదీప్‌ ఎండి సందీప్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు.