నిజామాబాద్ జిల్లా సి పి ఆదేశాల మేరకు 15 ఆగస్టు నుంచి ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని బోధన్ రూరల్ సీఐ నరేష్, రెంజల్ ఎస్సై ఈ. సాయన్న స్పష్టం చేశారు . మంగళవారం రెంజల్ మండలం నీల గ్రామం త పాటు, రెంజల్ పోలీస్ స్టేషన్ లో హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేటి సమాజంలో హెల్మెట్ వాడకపోవడం వల్ల అనేకమంది రోడ్డు ప్రమాదాలకు గురవుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. హెల్మెట్ వాడిన వారికి తలకు ఎలాంటి దెబ్బలు తగలకుండా రక్షణగా ఉంటుందని వారన్నారు. ద్విచక్ర వాహనదారులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పాటు, హెల్మెట్ తప్పకుండా ధరించాలని వేనియర్ల వారికి జరిమానా విధించడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేయరాదని, చరవాణి లో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాన్ని నడపకూడదని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.