– వార్డ్ ఆర్గనైజేషన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ రజిత..
నవతెలంగాణ – రెంజల్
హెచ్ఐవి, గృహించ చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించినట్లు వార్డు ఆర్గనైజేషన్ కమ్యూనిటీ కోఆర్డినేటర్ రజిత స్పష్టం చేశారు. మంగళవారం రెంజల్ మండలం వీరన్న గుట్ట ఉపాధి హామీ కూలీల కు ఆమె అవగాహన కల్పించారు. హెచ్ఐవి సోకిన వారికి ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉందనీ వారికి పింఛన్, ఉచిత బియ్యం అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. హెచ్ఐవి సోకిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. వారికి ఉచితంగా మందులను సైతం అందజేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. గృహహింస చట్టం కింద మహిళలలకు రక్షణ కల్పించడానికి తమ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఆమె తెలిపారు. మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన వెంటనే తన ఫోన్ నెంబర్ కు సమాచారం అందించినట్లయితే తమకు రక్షణగా నిలుస్తామని ఆమె పేర్కొన్నారు.