
మద్నూర్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు శనివారం నాడు మద్నూర్ పోలీస్ స్టేషన్లో చట్టాలపై అవగాహన కల్పించారు. పోలీస్ స్టేషన్ ఎస్ఐ గది లాకప్ గది తదితర అంశాలపై విద్యార్థినిలకు పోలీస్ శాఖ చట్టాల గురించి అవగాహన కల్పించారు. లాక్ అప్ లో ఎటువంటి వారిని వేస్తారు అనే దానిపై అవగాహన కల్పించారు చట్టాల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని పోలీస్ స్టేషన్ లో తెలియజేశారు. పోలీస్ స్టేషన్ తో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను తీసుకువెళ్లి విద్యార్థినిలకు శాఖల పరంగా అవగాహన కల్పించారు.