విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నవతెలంగాణ-వీణవంక
విద్యార్థి దశ నుండే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వీణవంక ఎస్సై శేఖర్ సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు మహిళా భద్రత, చట్టాలపై అవగాహ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డయల్ 100, 181, 1098 టోల్ ఫ్రీ నంబర్లపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీజీవీ ప్రిన్సిపాల్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.