
మండలంలోని నారాయణపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై యాదగిరి గౌడ్ గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై గ్రామస్తులకు బుధవారం అవగాహన కల్పించారు. గంజాయి మరియు డ్రగ్స్ లాంటి నిషేధిత మత్తుపదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలను, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై, పోలీస్ సిబ్బంది మరియు ప్రజలు, యువకులు పాల్గొన్నారు.