
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం అవగహన కల్పించారు. ఈ సందర్బంగా మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళా ముందడుగు వేసి పరిసరాలను పరిశుభ్రతగా ఉంచుతూ, వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర, మంగళ వారాలలో డ్రై డే నిర్వహించి, మీ ఇంటితో పాటు చుట్టూ పక్కల ఇండ్లలో కూడా డ్రై డే చేయు విధంగా అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వార్డులలో వచ్చే చెత్త బండికి తడి, పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్ధిక ఎదుగుదలకు ఉపయోగించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, సిఎల్ఆర్పీ జ్యోతి, మంజుల, ఆర్పీలు దేవేంద్ర, సునీత, రజిత, కె రజిత, అభేద భాను, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.