
పిల్లల పోషణ ఎదుగుదల పైన మరి కనులకు అసిస్టెంట్ సీడీపీఓ కమల అవగాహన కల్పించారు. శనివారం అచ్చంపేట సెక్టార్ సాయి నగర్ 12వ, 16వ అంగన్వాడి సెంటర్లో అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల పైన తల్లులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసము చేయించారు. అంగన్వాడి కేంద్రం పరిసరాలు, కిచెన్ గార్డెన్, ఆరోగ్య లక్ష్మి భోజనం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ విజయ, మణెమ్మ, అంగన్వాడీ టీచర్స్ లలిత, సంతోషి ,హెల్పర్స్, కిషోర బాలికలు, తల్లులు పాల్గొన్నారు.