మల్టీ ఫుల్ డిజేబుల్ పై అవగాహన

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో వివో ఏలకు మల్టిపుల్ డిసేబుల్ పై ఫిజియోథెరపీ డాక్టర్ నవీన్ అవగాహన కల్పించారు. అన్ని రకాల వికలత్వంపై ఫిజియోథెరపీ డాక్టర్ నవీన్ వివరిస్తూ శారీరక వికలాంగులు, మానసిక వికలాంగులు, బుద్ధి మాంద్యా వి కళాంగులు  పలు రకాల వికలత్వంపై సవివరంగా వివరించారు. పుట్టినరోజు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఎటువంటి వికలత్వం ఉన్న ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చు అన్నారు. పోషకాహారం లోపం వల్ల  వికలత్వం గల పిల్లలు పుడుతున్నారని, అంగన్వాడి ద్వారా అందించే పౌష్టికాహారాలు గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు సక్రమంగా అందించి వికలత్వాన్ని రూపుమాపాలన్నారు. వికలత్వం పిల్లలకు సర్జరీ అవసరం ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని హాస్పిటల్ లో చాలా సౌకర్యాలు ఉన్నాన్నారు. మండలంలో అన్ని గ్రామాలలో ఉన్న వికలత్వం గల చిన్నపిల్లలను మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శుభోదయం పాఠశాలకు పంపించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీఎం రవీందర్ రెడ్డి కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, మండలంలోని అన్ని గ్రామాల వివో ఏలు ఉన్నారు.