నవతెలంగాణ-చింతలమానేపల్లి
మండల కేంద్రంలోని గాయత్రి పాఠశాలలో సోమవారం పోలీస్ కళాబృందం నూతన చట్టాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు, సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సీఐ షాదిక్ పాషా మాట్లాడుతూ ప్రస్తుం సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మోసపోతే 1930 నంబర్‌కి ఫిర్యాదు చేయాలన్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకి ఉన్నత చదువులు చదివించాలన్నారు. ముడనమ్మకాలు నమ్మవద్దని, గ్రామాల్లో ఏ సమ్యస ఉన్న వెంటనే పోలీస్‌లకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరేష్, పోలీసు సిబ్బంది, పోలీస్ కళాబృందం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.