కార్పొరేట్‌ సంస్థలకు ఎన్‌పీఎస్‌పై అవగాహన

హైదరాబాద్‌: కార్పొరేట్‌ సంస్థల్లో ఎన్‌పిఎస్‌పై అవగాహన పెంచేందుకు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. ఇటీవల ఫిక్కీ సహకారంతో పిఎఫ్‌ఆర్‌డిఎ హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ కార్పొరేట్ల సమక్షంలో నూతన పెన్షన్‌ విధానం (ఎన్‌పీఎస్‌)పై ఒక కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొంది. ఈ కార్యక్రమంలో పీఎఫ్‌ఆర్‌డీఏ శాశ్వతకాల సభ్యురాలు మమతా శంకర్‌ ముఖ్య వక్తగా పాల్గొన్నారని తెలిపింది. తగినంత పెన్షన్‌ కవరేజీ ఆవశ్యకతను ఆమె వివరించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సుకు 50 కార్పొరేట్‌ సంస్థల నుంచి 120 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.