కిసాన్ తాండ గ్రామంలో పౌష్టిక ఆహారంపై అవగాహన..

నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలం కిసాన్ తాండ గ్రామంలో బుధవారం గర్భిణీ, బాలింత మహిళలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం జరిగిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని చిన్నారులకు వేషాదరణ పలువురిని ఆకర్షించింది. పోషణ మాసాన్ని పురస్కరించుకొని గర్భిణీ బాలింత మహిళలకు పౌష్టికాహారం వలన కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది. ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీ బాలింత మహిళలకు పౌష్టికాహరాన్ని అందజేయాలని అంగన్వాడి టీచర్ను ఆదేశించారు. ప్రతిరోజు పిల్లల ఎత్తులు బరువులను కలిసి తగిన ఆహారాన్ని అందించాలన్నారు. అంగన్వాడీలో కిచెన్ గార్డెన్ తో పాటు, మహిళలు తమ ఇంటి ఆవరణలో కూరగాయలు సాగు చేసుకోవాలని ఆమె సూచించారు. మూడు నుంచి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరూ అంగన్వాడి కేంద్రంలోని చేర్పించాలని ప్రైవేట్ పాఠశాలకు పంపకూడదని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మలావత్ జమున, ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు..