నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం లోని శ్రీ భాషిత విద్యార్థులకు శనివారం సాయంత్రం సేంద్రియ వ్యవసాయం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించినారు. పట్టణం లోని పెద్దోల్ల గంగారెడ్డి (అడ్వకేట్) ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి విద్యార్థులకు చెప్పారు. ఇంటి ఆవరణలో చెరుకును పండించి చెరుకు నుంచి బెల్లం తయారీ చేయు విధానాన్ని వివరించారు. ఈ చెరుకు పంట సంవత్సరానికి ఎన్నిసార్లు పండించాలి పండిస్తే ఎంత లాభం వస్తుంది. అనే విషయాలు చెప్పారు. అంతే కాకుండా ఎటువంటి రసాయనాలు ఉపయోగించకుండా చెరుకు పంటను పండించవచ్చు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో రసాయనాలు కలిగిన ఆహారం తినడం వలన చాలామంది రోగాల బారిన పడడం జరుగుతుంది అని అన్నారు. కాబట్టి మన ఇంటికి అవసరమైన బెల్లాన్ని మనమే తయారు చేసుకోవచ్చు అని వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరు రాబోయే తరాలవారికి భావి భారత పౌరులు కాబట్టి సేంద్రియ వ్యవసాయం పై అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ విద్యార్థుల కు ఇది చదువులో భాగమని , అంతేకాకుండా సేంద్రియ వ్యవసాయం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.