నవతెలంగాణ – రెంజల్
రాబోవు పార్లమెంటు ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పోలింగ్ అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లస్టర్ అధికారి ఆంజనేయులు అవగాహన కల్పించారు. శనివారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో తాసిల్దార్ ఎండి ఖలీల్ అధ్యక్షతన పోలింగ్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిష్పక్షపాతంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా వారికి సహాయ సహకారాలను అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రధానో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఐకెపిసిసిలు తదితరులు పాల్గొన్నారు.