సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన 

– ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు 

నవతెలంగాణ నెల్లికుదురు 
వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరావు మండల ప్రత్యేక అధికారి మరియన్న ఇన్చార్జి స్థానిక వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక తెలిపారు. మండల కేంద్రంలోని లైన్ డిపార్ట్మెంట్ రాజు ఎంపీడీవో బాలరాజులతో కలిసి సోమవారం సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే వ్యాధులైన మలేరియా డెంగ్యూ విష జ్వరాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎవరికైనా ఆరోగ్యం పట్ల ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే స్థానిక వైద్యాధికారిని సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరు ఫ్రైడే ఫ్రైడే అనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లయితే సీజనల్ వ్యాధుల నుండి కొంత బయటపడవచ్చు అని అన్నారు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో చేరవేయాలని తెలిపారు, వైద్య సిబ్బంది  సిహెచ్ఓ శాంతమ్మ, హెచ్ ఈ ఓ వెంకటేశ్వర్లు, సూపర్వైజర్లు రవి మంగమ్మ సాయిని సుల్తానా, అంగన్వాడి సూపర్వైజర్స్ మల్లీశ్వరి నాగమణి ఉషారాణి విజయ,  పిడిఎంఓ స్వాతి రవళి వెంకన్న త్రివేణి, ఏం ఎల్ హెచ్ పి లుప్రసన్న వినీత్ రమ్య, ఏఎన్ఎంలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.