విత్తన కొనుగోలులో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలపై  అవగాహన

నవతెలంగాణ – పెద్దవూర
రైతులు విత్తనకొనుగోలులో తీసుకోవలసిన జాగ్రత్తల పై వ్యవసాయ విస్తరణ అధికారీ కత్తి సీతార బుధవారం చలకుర్తి గ్రామం లో అవగాహన కల్పించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ వానాకాలంలో వరి,పత్తి, కందులు ఇతర పంటలు సాగు చేయుటకు రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు.రైతులు విత్తనాలను కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసే ముందు విత్తన సంచి మీద కంపెనీ పేరు,విత్తనరకం, బ్యాచ్ నెంబర్,లాట్ నెంబర్,రేటు ఉన్నదో పరిశీలించాలన్నారు.విత్తనం కొనుగోలు చేశాక రైతు తప్పకుండా బిల్ రశీదు తీసుకొని,అది పంట కాలం అయిపోయే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. గ్రామంలో లూజు విత్తనాలు,తక్కువ, ఎక్కువ ధరలకు విత్తనాలు అమ్మే వారెవరైనా వస్తే రైతులు వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వరిలో వెలుజలే పద్ధతి వలన కూలీల కొరతను అధిగమించి పెట్టుబడి తగ్గించవచ్చునని అన్నారు. ఎకరానికి 4.5 వేల రూపాయలను ఆదా చేయవచ్చని అన్నారు .విత్తనాలు ఎకరానికి 10 నుండి 15 కిలోల తగ్గించవచ్చానన్నారు .పద్ధతిలో నారు పెంపకం లేనందువలన పంట కాలం ఏడు నుంచి పది రోజులు తగ్గుతుందన్నారు.  డ్రం సీడర్ పద్ధతిలో వరి నాట్లు వేయాలని సూచించారు. వరి కంపోస్ట్ లాంటి సేంద్రియ పద్ధతులు ఉపయోగించి ఎరువులు తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుమ్మల పల్లి లలిత వెంకట్ రెడ్డి,ఎంపీటీసి గోదాల నారాయణ రెడ్డి, రైతులు వున్నారు.