వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

– స్థానిక వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ – నెల్లికుదురు
వేసవికాలంలో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ ఎస్ఐ కానుగుల క్రాంతి కిరణ్ ఎంపీడీవో బాలరాజు డిప్యూటీ తహసిల్దార్ తరంగిణి తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో గురువారం మండల టాస్క్ ఫోర్స్ సమావేశంలో వడగాలిలో వడదెబ్బ హెల్త్ ఎడ్యుకేషన్ లక్షలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు స్థానిక వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణార్జున ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తప్పనిసరి పాటించాలని అన్నారు. వడగాలులు,  వడదెబ్బ  అవగాహన, హెల్త్ ఎడ్యుకేషన్ లక్షణాలు, ప్రథమ చికిత్స అవగాహణ కల్పించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరముగా అంగన్వాడి టీచర్లకు ఏఎన్ఎం లకు ఆశ వర్కర్లకు నిర్వహించినట్లు తెలిపారు. ఓ ఆర్ ఎస్ ద్రావణము మరియు జింక్ టాబ్లెట్లు జోడి నెంబర్ వన్ గా ఈ ఎండాకాలంలో వాంతులు విరోచనాలు నివారించుటకు ఎంతో గా ఉపయోగపడుతుంది అని అన్నారు. కావున ప్రజలలో మనమందరము,  ఆశాలు,  అంగన్వాడి టీచర్లు,  సిస్టర్లు కలిసి ప్రజలను చైతన్యపరుస్తూ,  వారికి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియపరిచే బాధ్యత మన మీద ఉన్నది అన్నారు, ఈ కార్యక్రమం లో హెచ్ ఈ ఓ K.వెంకటేశ్వర్లు, సూపర్వైజర్ G. రవి సిబ్బంది షాహిన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.