ప్రజా పాలనపై ప్రజాప్రతినిధులకు, కార్యదర్శులకు అవగాహన.

నవతెలంగాణ- రెంజల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలనపై ప్రజాప్రతినిధులకు, గ్రామ కార్యదర్శులకు అవగాహన కల్పించడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్ పేర్కొన్నారు. బుధవారం లంజల మండల పరిషత్ కార్యాలయంలో అధికారులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న ప్రజా పాలన దరఖాస్తులు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని, దానిలో ప్రశాంతంగా దరఖాస్తులు పూర్తి చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలపై కొట్టివేతలు, దిద్దుబాటు లేకుండా చూసు కోవాలన్నారు. ప్రజా పాలనలో అర్హత గల వారందరూ వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పకుండా జత చేయవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రజని కిషోర్ తాసిల్దార్ రామచందర్, ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి, హెచ్ ఈ ఓ కరిపే రవీందర్, ఇన్చార్జి ఎపిఓ భాస్కర్, పి ఆర్ ఏ ఈ వినయ్ కుమార్, సర్పంచులు ఎమ్మెస్ రమేష్ కుమార్, మీర్జా కలీం బేగ్, జాదవ్ గణేష్ నాయక్, ముళ్ళపూడి శ్రీదేవి, రోడ్డ విజయ లింగం, గ్రామ కార్యదర్శులు రాజేందర్ రావ్, మహబూబ్ అలీ, రాఘవేందర్ గౌడ్, శ్రీకాంత్, సుమన్, సిహెచ్ సాయి, జి నవీన్, శివకృష్ణ రాజు,రాణి, రోజా, రజిత, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, ప్రసాద్, కవిత ,అజయ్, గోపికృష్ణ, తదితరులు పాల్గొన్నారు..