జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 3న పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీ మాల సంఘ భవనంలో క్షయ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత తెలిపారు. శుక్రవారం ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సుమలత ను కలిసి క్షయ నిర్మూలన పోస్టర్లను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 3న నిర్వహించే సదస్సులో ఆర్ఎంపీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్ఎంపి అసోసియేషన్ వ్యవస్థాపక జిల్లా అధ్యక్షులు రామోజీ వీరాచారి, ప్రధాన కార్యదర్శి రాళ్ల బండి శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కావటి రమేష్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు బోజారెడ్డి సుభాష్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి గజానన్ చౌహన్ పాల్గొన్నారు.