
నవతెలంగాణ – డిచ్ పల్లి
అతివేగం, మద్యం, రాంగ్ రూట్, హెల్మెట్, సిట్ బెల్ట్, ఫోన్ మాట్లాడుతూ, పరిమితికి మించి ద్విచక్ర వాహనాలపై వెళ్ళడం,ములమలుపుల వద్ద జాగ్రత్తగా ఉంటు వాహనాలు నడపి తమ ప్రాణాలను కాపాడుకోవాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ అన్నారు. శనివారం అత్హంగ్ డిచ్ పల్లి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ అద్వర్యంలో ఇందల్ వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా నుండి డిచ్ పల్లి మండలం లోని సుద్దపల్లి సీఎంసీ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద ఎసిపి నారాయణ మాట్లాడుతూ ప్రతి వాహనదరుడు తమ ప్రాణాలను కాపాడుకుంటూ వాహనాలను నడపాలని, మద్యం సేవించి, అతివేగంతో మూల మలుపుల వద్ద, హెల్మెట్ సీటు బెల్టులు ధరించకుండా వెళ్లి లేని ప్రమాదాలను కొని తెచ్చుకొని కుటుంబాలకు జీవితాంతం కష్టాల్లో నెట్ట వద్దని పేర్కొన్నారు. జాతీయ రహదారి వద్ద ఉన్న టోల్ ప్లాజా ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో బాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని, వాహనదారులకు అందజేసే సహాయ సహకారాలను వివరించారు. రాంగ్ రూట్లో వెళ్లి ఇబ్బందులు పడి ఇతరులకు ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ కుమార్,రూట్ ఆపరేషన్ మేనేజర్ వీరజ్, మేనేజర్ వీరబాబు,టోల్ ప్లాజా మేనేజర్ చలపతి రావు, సేఫ్టీ మేనేజర్ సతీష్ పానుగంటి, ఆపరేషన్ మేనేజర్ వీరజ్, మెయింటెనెన్స్ మేనేజర్ వీరబాబు తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.