మండల కేంద్రంలోని సాయి మణికంఠ మాడ్రన్ హై స్కూల్ యాజమాన్యం వ్యవసాయ పనులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి వ్యవసాయ క్షేత్రంలోనికి విద్యార్థులను తీసుకెళ్ళారు. వ్యవసాయ పనులపై విజ్ఞానం అందించడం, పొలం సాగు చేయడం, వరి నాటు వేయడంతోపాటు వివిధ వ్యవసాయ పనులపై ప్రత్యక్షంగా విద్యార్థులకు చూపించారు. వ్యవసాయ పనులపై విద్యార్థులకు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జైన రమాదేవి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పొలం నాటు వేసే పనులను చేశారు. ఆహార ధాన్యాలు ఎలా పంటలు పండిస్తారో తెలియకుండా ఈ కాలం పిల్లలు మొబైల్ కు అలవాటు పడి, వ్యవసాయ పనుల గురించి గానీ, వారి తల్లిదండ్రులు పడే శ్రమ వ్యవసాయ పనులు చేసే రైతుల కష్టాల గురించి గానీ పట్టించుకోవడం లేదు. అందుకని విద్యార్థులు ఒకరోజు వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లి వ్యవసాయ పనులు చేసినట్లయితే వారికి వాళ్ల తల్లిదండ్రులు, వ్యవసాయ కూలీలు, రైతులు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు అని తెలుస్తుందని అన్నారు. అలాగే వ్యవసాయం పట్ల పిల్లలకు గౌరవం ఏర్పడుతుందని, సాయి మణికంఠ ఉన్నత పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ జైన రమాదేవి తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఆలోచనతో క్షేత్ర పరిశీలనకు అవకాశం కల్పించిన కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ రమాదేవి, ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 250 పైగా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపక బృందం వ్యవసాయ క్షేత్ర రైతులు తదితరులు పాల్గొన్నారు.