యాదగిరిగుట్ట మండలం మల్లాపురం మంగళవారం, క్షేత్రస్థాయిలో సోషియో ఎకనామిక్ ఇష్యూస్ పైన అవగాహన పెంపొందించుకోవడం కోసం విలేజ్ లెవెల్ స్టడీ టూర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్ కు సంబంధించిన పలువురు ట్రైని ఆఫీసర్లు మండలంలోని ఆఫీసర్లతో, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ పిల్లలతో, అంగన్వాడి స్కూల్స్ ను సందర్శించి, కలిసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ అధికారులు అంకిత మౌర్య ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్, వీరు మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం, నాచురల్ గ్యాస్ కు సంబందించిన సెక్రటేరియట్ సర్వీస్ లో ఏ ఎస్ ఓ గా చేస్తున్నారు. వీరు అసిస్టెంట్ గ్రూప్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రియ బీహార్ రాష్ట్రం, వీరు గ్రూప్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు, వీరు మినిస్ట్రీ ఫర్ అర్బన్ అఫ్ఫైర్స్, హౌసింగ్ లో ఏ ఎస్ ఓ గా చేస్తున్నారు. కుమారీ స్వీటీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. వీరు మినిస్ట్రీ ఫర్ ఎక్స్పెండిచర్ లో ఏ ఎస్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. తమన్న హర్యానా రాష్ట్రం. వీరు కార్పొరేట్ అఫ్ఫైర్స్ కు సంబంధించి ఏ ఎస్ ఓ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నవీన్ కుమార్, అధికారులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.