గంజాయి, మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన..

నవతెలంగాణ – ఏర్గట్ల
మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్గట్ల ఎస్సై మచ్చెంధర్ రెడ్డి విద్యార్థులకు గంజాయి,మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరైనా గంజాయి అమ్మినా, పీల్చిన  తమ దృష్టికి తేవాలని, గంజాయి మహమ్మారి నిర్మూలనలో ప్రజలు తమ వంతుగా కృషిచేయాలని కోరారు. నంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులోభాగంగా ఉపాధ్యాయులు,పోలీస్ లు పాల్గొన్నారు.