– కామారెడ్డి జిల్లా టిఎస్ నాబ్ అధికారి డిఎస్పి సోమనాథం
నవతెలంగాణ – కామారెడ్డి
దేవనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కామారెడ్డి డిగ్రీ కాలేజ్ లో టీఎస్ నాబ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ నిర్మూలించాలని ఉద్దేశంతో కామారెడ్డి జిల్లా టిఎస్ నాబ్ అధికారి డిఎస్పి సోమనాదం డిగ్రీ కళాశాలవిద్యార్థులకు డ్రగ్స్ తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు, దాని పర్యవసానాలు తెలిపారు. ఎవరైనా డ్రగ్ సరఫరా గాని అదేవిధంగా తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన వివరాలను తెలియజేయాలన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తును మంచిగా నిర్మించుకోవాలని, ఎలాంటి చెడు ప్రవర్తనలకి,దురావాట్లకు లోను కాకూడదని విద్యార్థులకు వివరించారు. డ్రగ్స్ నిర్మూలనకు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవనపల్లి ఎస్ఐ రాజ, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ సంబంధించిన వివరాలు ఏమైనా ఉన్నట్లయితే డయల్ 100 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 14446 కి తెలుపలాన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.