కుష్టువ్యాధి పై విద్యార్థులకు అవగాహన

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని లోతుకుంటలో గల ఆదర్శ పాఠశాల, కస్తూరి బా బాలికల పాఠశాలలలో విద్యార్థులకు శనివారం కుష్టు వ్యాధిపై వైద్యాధికారి జ్యోతి అవగాహన కల్పించారు. ఈ సందర్భoముగా ఆమె మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో, ఎలాంటి  మచ్చలు ఏర్పడిన  వెంటనే వైద్యుల సలహాలు తీసుకొని మందులు వాడవలిసిన పద్ధతి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమoలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము,దుర్గా, హెల్త్ అసిస్టెంట్ లు శోభారాణి, సత్తయ్య, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.