నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని మోతుకులగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సెల్‌ఫోన్ వల్ల వచ్చే లాబాలు,నష్టాల గురించి మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు శుక్రవారం వివరంగా వివరించారు. పిల్లలు ఎక్కువ ఫోన్ లకు బానిస అవడం వల్ల అనేక రోగాల బారిన పడ్తునారని, బయట ప్రపంచంతో సంబంధం లేకుండ వున్నారని వారు చెప్పారు. కాబట్టి సెల్ ఫోన్ లకు పిల్లలు, విద్యార్థులు దూరంగా ఉండేటట్లు చూడాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులుప్రతిభ,జ్యోష్ణవి,ఇ.కీర్తి,కీర్తన,ఎస్.కీర్తి,రక్షిత,షీబా కెవికె గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి, ఉపాధ్యాయులు అశోక్ తదితరులు పాల్గొన్నారు.