
ప్రశస్త్ యాప్ పై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి శిక్షణను అవగాహనను కల్పించడం జరుగుతుందని ఎం.ఈ.ఓ పి.ప్రసాదరావు తెలిపారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన యాప్ పై శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు. ముందుగా చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నూతనంగా ఎంఈఓ బాధ్యతలు స్వీకరించనున్న క్రమంలో పలు ఉపాధ్యాయులు ప్రసాద్ రావును ను పూల బొకే లు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఉన్నటువంటి అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు శిక్షణకు హాజరుకావాలని శిక్షణకు హాజరైన ప్రతి ఒక్కరు యాప్ పై అవగాహన కల్పించుకుని దివ్యాంగ పిల్లల వివరాలు నమోదు అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని తెలియజేశారు. అలాగే సెప్టెంబర్ 26 న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారిని స్మరించుకోవడం జరిగిందని, భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హరిత,టి వీరేశ్వరరావు, వెంకయ్య, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీ లు ప్రభాకరాచార్యులు, రామారావు, సోమరాజు, జ్యోతి, మల్లేశ్వరరావు నాయక్, బి హనుమంతు నాయక్, రాజు, సీ.సీ.ఓ మహబూబ్, ఎం ఐ ఎస్ మాడి రమేష్, మెసెంజర్ శ్రీను, ఐఈఆర్పీలు రామారావు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.