ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన పెంచుకోవాలి..

– ఎస్ ఐ ఏ కమలాకర్ పసర పోలీస్ స్టేషన్ 
నవతెలంగాణ-గోవిందరావుపేట : ప్రజలు వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్.ఐ ఏ కమలాకర్ అన్నారు. బుధవారం మండలంలోని పసర గోవిందరావుపేట చల్వాయి గ్రామాల్లో జిల్లా ఎస్ పి ఆదేశానుసారం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా ప్రజలకు వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ  వాహనాలు నడిపేవారు 1) హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని 2) మద్యం సేవించి వాహనాలు నడపరాదని,3) త్రిబుల్ రైడింగ్ చేయరాదని,4) మైనర్ వారు వాహనాలు నడపరాదని,5) కార్లు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని,6) రాంగ్ రూట్లో వాహనాలు నడపరాదని , ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు ప్రమాదాలు, జరగకుండా జాగ్రత్త లు, తీసుకోవాలని తెలిపారు, ఈ నియమాలు పాటించని వారిపై  చట్టరీత్యా చర్యలు తప్పవని  హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో, గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ,