క్షయ (టీబీ) వ్యాప్తి – నివారణ పై అవగాహన..

Tuberculosis (TB) Spread - Awareness on prevention..నవతెలంగాణ – అశ్వారావుపేట
టీబీ నీక్షయ్ శివర్ వంద రోజులు కార్యక్రమం లో భాగంగా దమ్మపేట టి.బి. యూనిట్ ఆద్వర్యంలో గురువారం వినాయకపురం పీహెచ్ సి పరిధిలోని అశ్వారావుపేట రూరల్, సబ్ సెంటర్ పరిధిలోని డ్రైవర్ కాలనీ లో టీబీ వ్యాప్తి, నివారణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముందుగా దగ్గు దమ్ము తో బాధపడుతున్న అనుమానిత వ్యక్తుల నుండి “తెమడ” నమూనాను సేకరించారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్ మాట్లాడుతూ టీబీ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు వెలువడే తుంపర్లు గాలి ద్వారా వ్యాపించే వ్యాధి అని, కనుక ఇది నిర్దారణ అయిన వారు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయరాదని,దీని వలన ఇతరులకు త్వరగా ఈ టీ బి వ్యాపిస్తుందని,ముఖ్యంగా వ్యాధి గ్రస్తుల వద్దకు చిన్న పిల్లలను ఉంచ వద్దని,వారికి ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న కారణంగా ఇది వారికి త్వరగా వ్యాపిస్తుంది అని తెలిపారు.లక్షణాలు జ్వరం తో మొదలై,రెండు నుండి మూడు వారాల వరకు క్రమం తప్పకుండా దగ్గు వస్తుంటే, దానిని నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకుని,ఒకవేళ టీబీ గా నిర్దారణ ఐతే క్రమం తప్పకుండా ఆరు నెలలు పాటు మందులు వాడా లని టెక్నీషియన్ వెంకట్ సూచించారు.ఆరోగ్య కేంద్రం ఎం ఎల్ ఎ చ్ పి ఉషా మాట్లాడుతూ మందులు ప్రభుత్వ ఆసుపత్రి లో ఉచితంగా ఇస్తారని, వాడాల్సిన విధానం గురించి, టీ బి నిర్దారణ అయిన తర్వాత తీసుకోవాల్సిన పోషక ఆహారం, పాటించాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమం లో ఇరవై మంది దగ్గర నుండీ తెమడ శాంపిల్స్ సేకరించి ట్రూ నట్ కు పంపించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్, ఎం ఎల్ ఎచ్ పి ఉషా, ల్యాబ్ టెక్నీషియన్ రిజ్వాన్,వెంకట్, రెండవ ఎ ఎన్ ఎం జ్యోతి, ఆశా లు విష్ణు కుమారి,నాగమణి, ఝాన్సి మరియు అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.