నవతెలంగాణ-కాగజ్‌నగర్
కాగజ్‌నగర్ పట్టణంలోని అరుణోదయ ఉన్నత పాఠశాలలో మంగళవారం కాగజ్‌నగర్ డివిజన్ షీటీం ఆధ్వర్యంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీటీం సభ్యురాలు రమాదేవి మాట్లాడుతూ మహిళలు హింస, ఈవ్‌టీజింగ్, సైబర్ క్రైంలకు గురైతే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత భధ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అత్యవసర సమయాలలో డయల్ 100కు కాల్ చేయాలని, షీటీం కాగజ్‌నగర్ డివిజన్ సెల్ నెం. 8712670565కు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటు షీ టీం సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.