
కుభీర్ మండలంలోని పల్సి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ సాప పండరి విద్యార్థులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని తెలిపారు. మన పైన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని, సిగరెట్, గంజాయి,గుట్కా, తంబాకు, వైన్, కొకైన్, వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యమని లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని అన్నారు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుచుతున్నారని మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రథమ బహుమతి ఇ.పల్లవి 9వ తరగతి, ఎస్ కే ఆఫ్రిన్ ద్వితీయ బహుమతి 8వ తరగతి, జి నికిత 10వ తరగతి తృతీయ బహుమతి పొందగా,గెలుపొందిన బాలికలకు ప్యాడ్లు అందించారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు సురేష్ ఉపాధ్యాయ బృందం భాస్కర్ రెడ్డి, రాజశేఖర్, ఎర్రన్న, సాయికుమార్, మధుసూదన్, ఎల్లన్న, లింగన్న, సంజీవ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.