
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మెడికల్ అధికారి దివ్య అడల్ట్ బి సి జి వ్యాక్సినేషన్ పై వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టే అడల్ట్ బి సి జి వ్యాక్సినేషన్ ఎలా వేయాలి, అర్హులను ఎలా గుర్తించి యాప్ లో ఏ విధంగా అప్లోడ్ చేయాలి వివరాల పై శిక్షణ ఇచ్చారు. గత ఐదు సంవత్సరాల నుండి టీబీ వ్యాధిగ్రస్తుల జాబితా, బి.ఎం.ఐ 18 అంటే తక్కువ ఉన్న వాళ్లను, పొగ త్రాగే వారిని గుర్తించి వారి పేర్లు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించగానే గుర్తించిన వారందరికీ అడల్ట్ బి సి జి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ వెంకటరమణ, స్టాఫ్ నర్స్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.