బొల్లెపల్లి పిహెచ్ సిలో క్యాన్సర్ పై అవగాహన….

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని బొల్లెపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము సందర్భంగా థీమ్ , యునైటెడ్ బై యునిక్ నినాదం తో క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సిల్పిని మాట్లాడుతూ మొదటగా  క్యాన్సర్ యాది నీ గుర్తించి , చికిత్స అందించాలని సూచించారు. క్యాన్సర్ బాడిన పడిన వారందరినీ ముఖ్యమైన సంరక్షణ కోసం ప్రతి ఒక్క ఆశ, వైద్య సిబ్బంది తోడ్పాటు అందించాలని కోరారు. క్యాన్సర్ పై ఎల్లప్పుడు రోగులకు సలహాలు సూచనలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డాక్టర్ యామిని శృతి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.