రబీ హైబ్రిడ్ సీడ్స్ ఆధ్వర్యంలో మండలంలోని పెద్దతూండ్ల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సును అడ్వాలపల్లి గ్రామానికి చెందిన రైతు ఇప్ప మొండయ్య మిరప క్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు రవి హైబ్రిడ్ సీడ్స్ ఉత్తర తెలంగాణ రీజినల్ మేనేజర్ కట్ల శ్రీనివాస్ , బ్రాంచ్ మేనేజర్ లింగమూర్తి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రవి సీడ్స్ ఆర్ హెచ్ ఎస్-365, శ్వేత -041 మిరప రకలు రైతులను లాభాల బాటిలో ఉంచేలా తోడ్పడుతుంది అన్నారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రోగనిరోధక మరియు తెగుళ్ళను తట్టుకొనే శక్తి కలిగి ఉండడం రవి సీడ్స్ విత్తనాల యొక్క ప్రత్యేకత. ఆర్ హెచ్ ఎస్ 365 మరియు. శ్వేత- 041 రకం ఏపుగా పెరిగి కాయ రంగు,పరిమాణం మొదటి కోత నుండి చివరి కోత వరకు ఒకే విధంగా ఉంటుంది. కాయ పరిమాణంతోపాటు గింజలు ఎక్కువగా ఉండటం వల్ల పంట దిగుబడి అధికంగా ఉంటుంది అని, నాణ్యమైన విత్తనాలు అందించడంలో రవి సీడ్స్ సంస్థ ఎప్పుడు ముందు ఉంటుందని పేర్కొన్నారు.మండల ఎంపీపీ మల్హర్ రావు, రైతు మొండయ్యయ్య మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఈ విత్తనాన్ని (ఆర్ హెచ్ ఎస్ 365 ,శ్వేత 041) ఎంచుకోవడం ద్వారా పెట్టుబడి వ్యాయం తగ్గడంతో పాటు అధిక దిగుబడి వచ్చే విధంగా రైతుకి ఎంతో భరోసాగా ఉంటుంది అని ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు నాయక్ ,రవి సీడ్స్ కంపెనీ సేల్స్ ఆఫీసిర్లు కొల్లూరి చందు, తూళ్ల వేంటేటేష్ నునవత్ రాజు, దరావత్ శ్రీను, పెద్ది మహేష్ మరియు పరకాల, చిట్యాల , మహాదేవపూర్ గ్రామాలకు చెందిన దాదాపు 600 మంది రైతులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.