నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 20, 21న కొత్త ఓటర్ల నమోదు కోసం చేపట్టిన క్యాంపియన్ లో వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తులు అలాగే ఓటర్ కార్డులో తప్పుల సవరణ కోసం వచ్చిన దరఖాస్తుల పట్ల మంగళవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల తాహసిల్దార్ ఎండి ముజీబ్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో తప్పులను జాగ్రత్తగా సవరించాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులో సీనియర్ అసిస్టెంట్ ఎలక్షన్ విజయ్ ఓటర్ల జాబితా సవరణ గురించి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శంకర్ ఎలక్షన్ ఆపరేటర్ ముస్తఫా జూనియర్ అసిస్టెంట్ బాలరాజు వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు బిఎల్వోలు పాల్గొన్నారు.