ఆరోగ్య పరిరక్షణపై అవగాహన..

– ఆర్ బి ఎస్ కే, డాక్టర్ విజయభాస్కర్..
నవతెలంగాణ- రెంజల్ 
పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడిలకు లోన్ అవుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారని, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆర్బిఎస్కే డాక్టర్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో రక్తహీనతపై పరీక్షల నిర్వహించి 80 మంది విద్యార్థులకు పరీక్ష చేశారు. కొంతమంది విద్యార్థులను పరీక్షించిన ఆయన మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతూ సమయపాలనను పాటించకపోవడం వల్లే వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉందన్నారు. సమయానుకూలంగా పౌష్టికాహారాన్ని తీసుకుంటూ సమయం పాటించాలన్నారు. రాత్రులలో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తూ చదువుకోరాదాని, చదివే కొద్దిసేపైనా మనసుపెట్టి చదువుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు శ్యామల, ఆరోగ్య కార్యకర్త మంజుల, వ్యాయామ ఉపాధ్యాయురాలు శ్రీలత, ఉపాధ్యాయులు శిల్ప, స్వప్న, సుజాత తదితరులు పాల్గొన్నారు.