బాల్య వివాహాల నిషేధంపై అవగాహన

Awareness on Prohibition of Child Marriageనవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రం లోని పరిధిలోని కస్తూరీభా గాంధీ పాఠశాలలో శుక్రవారం పోషణ్ అభియాన్, బాల్య వివాహాల నిషేధం పై విద్యార్థులకు అనుముల ప్రాజెక్ట్ సీడీపీఓ ఉదయశ్రీ అవగాహన కల్పించారు.ఈసందర్బంగా మాట్లాడుతూ కిషోర బాలికలు ప్రభుత్వం ఇచ్చే సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.బాలికలను చదివిద్దాం-బాలికలను రక్షిద్దాం” అనే నినాదం తో ప్రభుత్వం ముందుకు వేలుతుందని అన్నారు.చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల  అమ్మాయిలు మానశిక, శారీరక ఒత్తిడికి గురి కావడం మరియు ప్రసవ సమయంలో తల్లి బిడ్డ ప్రాణాలు కోల్పోతారని  తెలుపారు.ఆడ పిల్లలకు 18 సంవత్సరాలు మగ పిల్లలకు 21 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహ ప్రయత్నాలు చేయడం ఉత్తమము అని తెలియజేశారు అలా కాకుండా బాల్య వివాహం చేయాలని చూస్తే  బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం బాల్య వివాహాo చేసుకున్న, నిర్వహించిన, సహకరించిన మరియు హాజరైన  ప్రతి ఒక్కరూ శిక్షార్హులని పేర్కొన్నారు.ఇందుకు గాను రెండు సంవత్సరాలు జైలు శిక్ష లేదా లక్ష రూపాయలు జరిమానా లేదా రెండు విదింప బడుతాయని  తెలియజేశారు.ఎక్కడైనా బాల్య వివాహాలు చేయాలని ప్రయత్నిస్తుంటే వెంటనే టోల్ ప్రీ నంబర్లు 1098, 100 మరియు 112 లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటారని తెలియజేసినారు. ప్రతి మండలంలో ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాలల హక్కుల పరిరక్షణ కోసం ముందస్తు చర్యగా  గ్రామస్థాయిలో మరియు పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు.ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పని చేసినపుడే బాల్య వివాహ వ్యవస్థను రూపు మాపవచ్చునని తెలిపారు.అంతే కాకుండా అమ్మాయిలు  తల్లిదండ్రులకు నమ్మకాన్ని ఇస్తూ చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకోవాలని మరియు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడం కోసం మధ్యలో ఎదురైయ్యే చిన్న చిన్న ఆకర్షణలను త్యాగం చేసినపుడే గొప్పవారు అవుతారని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో  ఐసిడిఎస్ సూపర్వైజర్ వెంకాయమ్మ, సీహెచ్ఓ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జ్యోస్న,శశిపుష్పలత, అంగన్వాడీ టీచర్లు వసుందర, కల్పన, మంగమ్మ, ఎల్లమ్మ, పుష్పమ్మ, ఏఎన్ఎం వెంకమ్మ, ఆశావర్కర్ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.