భువనగిరి మండలంలోని అనాజిపురం గ్రామ పరిధిలో గల దివ్యబాల విద్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు సేఫ్టీ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫౌండర్ కాటరాజులు, కరస్పాండెంట్ చిన్నప్ప, ప్రిన్సిపాల్ హరికృష్ణ, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.