
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నరసన్నపల్లి వద్ద గల విద్యా నికేతన్ స్కూల్ లో రోడ్డు భద్రత పై 850 మంది విద్యార్థులకు జిల్లా రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించరు. ఈ అవగాహన కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మోటార్ వాహన తనిఖీ అధికారి, నాగలక్ష్మి , సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.