హెల్మెట్ ప్రయోజనాలపై అవగాహన: సీఐ నరేష్

Awareness of the benefits of helmets: CI Nareshనవతెలంగాణ – రెంజల్ 

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 15 నుంచి ద్విచక్ర వాహన ఎట్టి పరిస్థితిలోనూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయరాదని బోధన్ రూరల్ సిఐ నరేష్, ఎస్సై ఈ. సాయన్న లు పేర్కొన్నారు సిపి, ఆదేశాల మేరకు. శనివారం మండలంలోని వీరన్న గుట్ట గ్రామంలో హెల్మెట్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వాహనదారులు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణం చేస్తే జరిమానా విధిస్తామన్నారు. మైనర్ బాలురకు ద్విచక్ర వాహనాలను ఇవ్వరాదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై సహాయంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.