
భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం యాంటీబయాటిక్స్ యొక్క బాధ్యతాయుతమైన వినియోగంపై సౌకర్య స్థాయి ప్రతిజ్ఞ హెచ్ ఈ ఓ వెంకటరమణ అధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటీబయాటిక్స్ వినియోగంలో బాధ్యతాయుతంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు ప్రతి చిన్న జబ్బుకు యాంటీబయాటిక్స్ వాడడం మూలంగా జరిగే నష్టాలను వివరించి, యాంటీబయాటిక్ మందులు ఫుల్ కోర్స్ వాడాలని వైద్యుల సిఫారసు మేరకు మాత్రమే వేసుకోవాలని తెలిపారు. మందులతో పాటు పౌష్టిక ఆహారం తీసుకోవాలని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్ చైతన్య , పల్లె దవఖాన డాక్టర్ ప్రశాంత్ , ఫార్మసిస్ట్ స్వామి, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, డీఈవో సిద్ధార్థ్ , హెల్త్ అసిస్టెంట్ సతీష్, ఆశలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.