ప్రపంచ దోమల దినోత్సవంపై అవగాహన

Awareness on World Mosquito Dayనవతెలంగాణ – రెంజల్

దోమల వలన వచ్చే వ్యాధుల ను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వినయ్ కుమార్ అవగాహన కల్పించారు. మంగళవారం రెంజల్ మండలంలోని వీరన్న గుట్ట ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులకు దోమలు మరియు దోమల వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. దోమల వల్ల పైలేరియా, మలేరియా, డెంగ్యూ, చికెన్ గూనియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమలు పుట్టకుండా, మరియు పుట్టకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. డెంగ్యూ వ్యాధి అనేది ఈజిప్ట్ ఎడి ప్లే అనే దోమ కాటు వల్ల సంభవిస్తుందని, ఈ దోమ పుట్టిన వ్యక్తిని ఐదు రోజుల నుంచి పది రోజులలో వ్యాధికారక డెంగ్యూ వ్యాధికి గురవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన వారికి నీరసం, తలనొప్పి లాంటివి వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తీర్ణ అధికారులు కరిపే రవీందర్, చింతాల శ్రావణ్ కుమార్, ఆరోగ్య కార్యకర్తలు అంగన్వాడీలు పాల్గొన్నారు.