నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలోని ఉప్లూర్ రైతు వేదిక భవనంలో మంగళవారం పసుపు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పైసిస్ బోర్డు నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.స్పైసిస్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్ సుందరేశన్ రైతులకు పసుపు పంటలో మార్కెటింగ్, విలువ ఆధారితలో తీసుకోవలసిన మెలకువలు పైన రైతులకు ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన స్పైసిస్ బోర్డ్ తరఫున అందజేసే పలు సబ్సిడీల వివరాలను రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం పద్మ చిన్నారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పిప్పర అనిల్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమేష్, రైతులు బద్దం రమేష్ రెడ్డి, బద్ధం తిరుపతి, కొమ్ముల రంజిత్ రెడ్డి, పలువురు రైతులు, తదితరులు పాల్గొన్నారు.