నవతెలంగాణ -ఆర్మూర్
పట్టణంలోని జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ బుధవారం చంద్రయాన్ – 3 లాండింగ్ యొక్క విశేష సందర్భాన్ని ఘనంగా జరుపుకున్నము ఇట్టి కార్యక్రమంలో జెంటిల్ కిడ్స్ ప్లే స్కూల్ డైరెక్టర్ అండ్ కరస్పాండెంట్ లయన్ ప్రకాష్ గుజరాతి పిల్లలకు చంద్రయాన్ 3 సాటిలైట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలిపారు ,ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సాటిలైట్ లాంచింగ్ కి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ లతా అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.