నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో శనివారం విద్యార్థినీలకు, కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.. విద్యార్థినీలతో భారీ ర్యాలీ నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ప్యారా మెడికల్ ఆఫీసర్ (డిపిఎమ్ఓ) నీరటి సంజీవరావు మాట్లాడుతూ.. లెప్రసీ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లేప్రే అని బ్యాక్టీరియా వల్ల కలుగుతుందని, ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని నరాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను దూరం చేయాలన్నారు. వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చు అన్నారు. శరీరం పైన తెల్లని రాగి రంగు మచ్చలు కలిగి ఉండి స్పర్శను కోల్పోయి ఉన్నట్లయితే లెప్రసి లక్షణాలు ఉన్నట్లుగా భావించి, దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పటల్ ని సంప్రదించాలన్నారు.ఈ వ్యాధికి మల్టీ డ్రగ్ తెరపి ద్వారా చికిత్స చేస్తారు.. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్తీ శ్రీనివాస్, సమ్మయ్య, హెచ్.వి సరస్వతి, హెల్త్ అసిస్టెంట్ చేల తిరుపతయ్య, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, ఆశా కార్యకర్త, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.