ప్రభుత్వ పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్

మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు కుష్టి వ్యాధిపై అవగాహన కార్యక్రమం  నిర్వహించినారు.. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గిరిబాబు మాట్లాడుతూ.. లెప్రసీ వ్యాధి మైక్రో బ్యాక్టీరియం లేప్రే అని బ్యాక్టీరియా వల్ల కలుగుతుందని ఈ వ్యాధి ముఖ్యంగా చర్మాన్ని నరాలను ప్రభావితం చేస్తుంది. శరీరం పైన తెల్లని రాగి రంగు మచ్చలు కలిగి ఉండి స్పర్శను కోల్పోయి ఉన్నట్లయితే లెప్రసి లక్షణాలు ఉన్నట్లుగా భావించాలి. ఈ వ్యాధికి మల్టీ డ్రగ్ తెరపి ద్వారా చికిత్స చేస్తారు.. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఆరోగ్య కార్యకర్త జక్కుల మోహన్, ఆశ కార్యకర్తలు అరుణ, సుభద్ర, రమ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు..